- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్ ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



