బాలా త్రిపుర సుందరి
నవతెలంగాణ-మిడ్జిల్
గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, పరిశుభ్రమైన దేశం కోసం ప్రజల ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాల త్రిపుర సుందరి చెప్పారు. సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో బైరంపల్లీ, కంచనపల్లి గ్రామంలోని పాఠశాలలో పేరుకుపోయిన చెత్తను తీసివేసి పాఠశాల ప్రహరిని పరిశుభ్రంగా చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలు, యువకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. తడి ,పొడి చెత్తను వేరు వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, మండల అధ్యక్షులు నరేష్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శిలు వాసుదేవ్, శేఖర్, మండల ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, మండల నాయకులు బైరంపల్లి మాజీ సర్పంచ్ బీరయ్య, బూత్ అధ్యక్షులు శివ, లింగం, నాగేష్, బాలయ్య ,మహేష్, పండు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



