Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీతారాంపురం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

సీతారాంపురం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ సీతారాంపురం గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీశైలం 
మాజీ ఎంపీటీసీ ఇరియా నాయక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

నెల్లికుదురు మండలంలోని సీతారాంపురం గ్రామపంచాయతీలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని విచారణ జరిపి రికవరీ చేసి బాధ్యత పరిచర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీ ఆ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ ఇరీయా నాయక్ బొడ్గం చంద్రారెడ్డిలు సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్)లో కలెక్టర్‌కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం.. గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా రూ.4 లక్షల 17 వేల నిధులను నోట్ ఫైల్, ఎంబీ ఆధారంగా విడుదల చేశారని, ఆ మొత్తాన్ని ఎం పీ డబ్ల్యూ వర్కర్ గూబ శ్రీనివాస్ ఖాతాలోకి బదిలీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నామని అన్నారు. పనులు జరగకుండానే ప్రభుత్వ నిధులు డ్రా చేసిన అంశంపై సమగ్ర విచారణ జరిపి నిధులను రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే, ఈ విషయమై మాజీ సర్పంచ్ బొడగం సోమేశ్వరి చంద్రారెడ్డి గ్రామ ప్రజలతో కలిసి మండల పంచాయతీ అధికారిణి (ఎంపీఓ) పద్మను ప్రశ్నించగా, ఆమె దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. మాజీ ప్రజాప్రతినిధికి తగిన గౌరవం ఇవ్వకుండా అభ్యంతరకరంగా మాట్లాడటంతో పాటు అవమానకరంగా వ్యవహరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కూడా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాత మల్లయ్య, నక్క పుల్లయ్య, బేతు ఉప్పలయ్య, కాబట్టి బ్రహ్మం, బోడగం శ్రీనివాసు, వాల్య నాయక్, రవి, రాజేందర్, వెంకన్న పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -