నవతెలంగాణభువనగిరి కలెక్టరేట్
నిరుపేద కుటుంబ లైన పూరీ గుడిసెలలో, డేరా, రేకుల షేడ్ ఇండ్ల లో నివసించే వారిని గుర్తించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వి. సి హాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు , ఎంపీడీవో, ఏఈలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆయా మండలాల వారీగా సమీక్షిస్తూ, ఇప్పటి పురోగతి లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషిచేయాలన్నారు.జిల్లాలోని అన్ని నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో,పూర్తయ్యేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. గృహప్రవేశాలు పురోగతిని త్వరగా పూర్తిచేయాలని అని ఆదేశించారు. మరియు 2 వ విడత లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. మండలాలలో నిరుపేదలైన పూరి గుడిసెలలో, డేరా, రేకుల ఇండ్ల లో నివసించే వారిని గుర్తించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి, హౌసింగ్ పీడీ అలివేలు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



