Monday, February 16, 2026
E-PAPER
Homeజాతీయంహక్కులను కాపాడుకుందాం

హక్కులను కాపాడుకుందాం

- Advertisement -

ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ సదస్సులో వక్తల పిలుపు
పూణేలో అఖిలభారత అంగన్‌వాడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ 11వ సదస్సు ప్రారంభం

పూణే : అంగన్‌వాడీల హక్కుల్ని కాపాడుకోవటానికి ఐక్య ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని వక్తలు పిలుపు ఇచ్చారు. అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌)11వ సదస్సు శనివారం పూణేలోని బనేర్‌లోని నీలిమా మైత్రా నగర్‌లో ప్రారంభమైంది. సీఐటీయూ జెండాను కె. హేమలత ఆవిష్కరించారు. ఏఐఎఫ్‌ఏడ బ్ల్యూహెచ్‌ జెండాను ఆ సంఘం అధ్యక్షురాలు ఉషా రాణి ఎగురవేశారు. ఏఆర్‌ సింధు మూడేండ్ల నివేదికను సమర్పించారు.

ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు పూణేలో జరిగే నాలుగు రోజుల సమావేశంలో జమ్మూకాశ్మీర్‌, కేరళ, అసోం, గుజరాత్‌ , మహారాష్ట్రతో సహా 25 రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 16న (సోమవారం) అంగన్‌వాడీ విజయాలు, సవాళ్లు, ముందుకు సాగే మార్గం అనే అంశాలపై సెమినార్‌ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో డబ్ల్యూసీడీ మాజీ కార్యదర్శి ఉజ్వల్‌ ఉకే, , డాక్టర్‌ సుచితా కృష్ణప్రసాద్‌ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 17న ఆల్ప్‌ బచత్‌ భవన్‌లో ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీలో సీఐటీయూ అధ్యక్షుడు సుదీప్‌ దత్తా, సీఐటీయూ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ డి ఎల్‌ కరాడ్‌, సీఐటీయూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంహెచ్‌ షేక్‌, ఇతర ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ ఆఫీస్‌ బేరర్లు ప్రధాన వక్తలుగా పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -