Tuesday, June 16, 2026
E-PAPER
Homeసినిమాఓనం కానుకగా విడుదల

ఓనం కానుకగా విడుదల

- Advertisement -


దుల్కర్ సల్మాన్ నయా మూవీ ‘ఐ యామ్ గేమ్’. ఓనం కానుకగా ఈ చిత్రాన్ని ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
దుల్కర్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి షహబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ కథా రచన, స్క్రీన్‌ప్లే అందించారు. దక్షిణ భారతదేశంలోని వందకు పైగా లొకేషన్లలో చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది.
దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కు తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆంటోని వర్గీస్, మిస్కిన్, కాయడు లోహర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -