Tuesday, June 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంశాంతి దిశగా 
చారిత్రక అడుగు

శాంతి దిశగా 
చారిత్రక అడుగు

- Advertisement -

శాశ్వతంగా సైనిక చర్యలకు స్వస్తి
ఇరాన్‌-అమెరికా మధ్య ఒప్పందం
19న జెనీవాలో సంతకాలు
స్వాగతించిన ప్రపంచ నేతలు
సంతకాల తర్వాతే హార్ముజ్‌లో
యధావిధిగా నౌకాయానం: ఇరాన్

నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌
మధ్యప్రాచ్యంలో ఫిబ్రవరి 28న మొదలై మూడు నెలలకు పైగా కొనసాగిన యుద్ధానికి శాశ్వతంగా తెర దించుతూ ఇరాన్‌, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ దాడులు సహా అన్ని రకాల సైనిక చర్యలు నిలిచిపోతాయి. ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనానికి స్వస్తి చెబుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని, ఆ తర్వాత హార్ముజ్‌ జలసంధిలో నౌకాయానం యధావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. శాంతి ఒప్పందం కుదరడంలో జరిగిన జాప్యానికి ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూయే కారణమని మండిపడ్డారు. అమెరికా దౌత్య యత్నాలకు ఆయన ధన్యవాదాలు చెప్పుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. ఇరాన్‌-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రపంచ నేతలు స్వాగతించారు. తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గిపోయాయి. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్‌ శాంతి ఒప్పందంపై తొలుత ప్రకటన చేయగా అమెరికా, ఇరాన్‌ ధృవీకరించాయి. ఒప్పందంపై ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అధికారికంగా సంతకాలు జరుగుతాయి. ఆ తర్వాత తుది ఒప్పందం కోసం 60 రోజుల వ్యవధిలో సంప్రదింపులు కొనసాగుతాయి. కీలక హార్ముజ్‌ జలసంధిని తెరిచి వాణిజ్య నౌకల రాకపోకలను అనుమతించడం, ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని నివారించడమే లక్ష్యంగా ఒప్పందాన్ని రూపొందించారు. అయితే హార్ముజ్‌ను ఇప్పటికిప్పుడు యుద్ధానికి ముందున్న స్థితికి తీసుకురావడం సాధ్యపడక పోవచ్చు. మందుపాతరల తొలగింపు, దెబ్బతిన్న మౌలిక సదుపా యాలకు మరమ్మతులు, నౌకాయానానికి భద్రత కల్పించడం వంటి పనులకు సమయం పట్టవచ్చు. కాగా ఇరు పక్షాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ఇరాన్‌ అణు కార్యక్రమం, శుద్ధి చేసిన యురేనియం నిల్వల తొలగింపుపై చర్చలకు దారి చూపుతోంది. తుది ఒప్పందానికి నిర్దేశించుకున్న రెండు నెలల గడువు కాలంలో…ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తొలగించే విషయం పైన, విదేశాలలో స్తంభింపజేసిన ఆ దేశపు ఆస్తుల విడుదల విషయం పైన అమెరికా కూడా నిర్ణయం తీసుకుంటుంది.

ఒప్పందం పూర్తయింది : ట్రంప్‌
80వ పుట్టిన రోజును జరుపుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోపల్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ ‘ఇరాన్‌తో ఒప్పందం పూర్తయింది. హార్ముజ్‌ జలసంధిని టోల్‌తో నిమిత్తం లేకుండా తెరవడానికి నేను పూర్తిగా అనుమతిస్తున్నాను. అదే విధంగా అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించేందుకు కూడా అనుమతి స్తున్నాను. ప్రపంచంలోని నౌకల ఇంజిన్లు ఇక పని ప్రారంభిం చవచ్చు. చమురు సరఫరాలను యధావిధిగా కొనసాగించవచ్చు’ అని తెలిపారు.

ఎంఓయూలో ఏముంది?
ఇరాన్‌, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంలో ఏముందో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. తుది ఒప్పందం కోసం సంప్రదింపులు ప్రారంభించడానికి ముందే…విదేశాలలో స్తంభింపజేసిన 12 బిలియన్‌ డాలర్ల ఇరాన్‌ ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందని టెహ్రాన్‌కు చెందిన మెహర్‌ వార్తా సంస్థ తెలిపింది. ఈ వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం….ఎంఓయూలో 14 అంశాలు ఉన్నాయి. ఎంఓయూపై సంతకాలు జరిగిన తర్వాత 60 రోజుల పాటు తుది ఒప్పందంపై సంప్రదింపులు జరుగుతాయి. ఆ సమయంలో మిగిలిన ఇరాన్‌ ఆస్తులను అమెరికా విడుదల చేస్తుంది. లెబనాన్‌లో సహా అన్ని రకాల సైనిక చర్యలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేస్తారు. ఇరాన్‌ ఆంతరంగిక వ్యవహారాలలో అమెరికా జోక్యం చేసుకోదు. దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుంది. ఇరాన్‌ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని అమెరికా 30 రోజులలో పూర్తిగా తొలగిస్తుంది. హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ 30 రోజులలో తిరిగి తెరుస్తుంది. ఇరాన్‌ పరిసరాలలో మోహరించిన దళాలను అమెరికా ఉపసంహరించుకుంటుంది. చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలను ఎత్తివేస్తారు. ఇరాన్‌ ఆర్థిక వనరులన్నీ దానికి అందుబాటులోకి వస్తాయి. కనీసం 300 బిలియన్‌ డాలర్ల వ్యయమయ్యే పునర్నిర్మాణ ప్రణాళికలను అమెరికా, దాని మిత్ర దేశాలు సమర్పిస్తాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఎంఓయూ ప్రకారం…ఇరాన్‌ అణు కార్యక్రమం పైన, అమెరికా ఆంక్షలను పూర్తిగా తొలగించే విషయం పైన తుది ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉద్దేశించిన గడువు కాలంలో సంప్రదింపులు జరుగుతాయి. ఐరాస భద్రతా మండలి తీర్మానాలు, ఐఏఈఏ గవర్నర్ల తీర్మానాలపై కూడా ఆ సమయంలో చర్చలు జరుగుతాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) కింద ఇచ్చిన హామీ మేరకు అణ్వాయుధాలను ఇరాన్‌ ఉత్పత్తి చేయదు. సంప్రదింపులు జరిగే రెండు నెలల కాలంలో అమెరికా మధ్యప్రాచ్యానికి అదనపు దళాలను తరలించదు. అలాగే ఇరాన్‌పై కొత్తగా ఆంక్షలు కూడా విధించదు. స్తంభింపజేసిన 24 బిలియన్‌ డాలర్ల ఇరాన్‌ ఆస్తులను సంప్రదింపుల కాలంలో అమెరికా విడుదల చేస్తుంది. సంప్రదింపులు ప్రారంభం కావడానికి ముందే అందులో సగం మొత్తం ఇరాన్‌కు అందుబాటులోకి వస్తుంది. ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు ఓ యంత్రాంగాన్ని రూపొందిస్తారు. తుది ఒప్పందాన్ని ఐరాస భద్రతా మండలి తీర్మానం ధృవీకరిస్తుంది. స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులలో సగ భాగాన్ని అమెరికా విడుదల చేసే వరకూ, చమురు ఆంక్షలు ఎత్తివేసే వరకూ, నౌకాయాన దిగ్బంధనాన్ని తొలగించే వరకూ తుది చర్చలు ప్రారంభం కావు. అణు సామగ్రి, యురేనియం శుద్ధి, ఆంక్షల తొలగింపు, ఇరాన్‌ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమం భవితవ్యం పైనే తుది ఒప్పందం దృష్టి సారిస్తుంది. ఇరాన్‌ క్షిపణి కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో కొన్ని గ్రూపులకు ఇరాన్‌ ఇస్తున్న మద్దతు వంటి అంశాలను అజెండా నుంచి తొలగించారు.

ఆస్తుల విడుదలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు
ఎంఓయులోని కొన్ని అంశాలపై ఇరాన్‌, అమెరికాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశాయి. స్తంభింజేసిన ఇరాన్‌ ఆస్తులలో కొంత భాగాన్ని ముందుగానే విడుదల చేసేందుకు తాము ఆంగీకరించామంటూ వచ్చిన వార్తలను అమెరికా సీనియర్‌ అధికారి ఒకరు తోసిపుచ్చారు. ప్రతస్పదిత ఒప్పందానికి సంబంధించి అంకెలు, షరతులపై ఇరాన్‌ మీడియా, అమెరికాకు చెందిన పాత్రికేయులు భిన్న కథనాలు విన్పించారు. స్తంభింపజేసిన పాతిక బిలియన్‌ డాలర్ల ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందని ఎంఓయూలో పొందుపరి చారంటూ ఇరాన్‌ సీనియర్‌ అధికారి రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలియజేశారు. అమెరికాతో జరిగిన చర్చల వివరాలను ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తెలియజేస్తూ 14 సూత్రాల ఎంఓయూపై సంతకాలు జరిగిన తర్వాత ఇరాన్‌ ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందని తెలిపారు. నౌకాయానంపై అమెరికా విధించిన దిగ్బంధనం ఎత్తివేత ఎంఓయూలో తొలి అంశంగా ఉందని కూడా చెప్పారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తదుపరి దశ చర్చలలో ప్రస్తావిస్తామని అన్నారు. స్తంభింప జేసిన ఇరాన్‌ ఆస్తులను వాషింగ్టన్‌ విడుదల చేస్తుందంటూ వచ్చిన వార్తలను అమెరికా సీనియర్‌ అధికారులు, ఇతర అధ్యక్షభవనం వర్గాలు తోసిపుచ్చాయి. ఇచ్చిన హామీలను ఇరాన్‌ నెరవేర్చే వరకూ ఆస్తుల విడుదల జరగదని అవి స్పష్టం చేశాయి. అరవై రోజుల చర్చలు ప్రారంభం కావడానికి ముందు స్తంభింపజేసిన ఆస్తులను ఇరాన్‌ పొందలేదని చెప్పాయి. సంతకాల తర్వాతే హార్ముజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలను అనుమతిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.

హామీలు అమలైతేనే 
తుది ఒప్పందంపై చర్చలు : ఇరాన్‌
ప్రస్తుత ఒప్పందం యుద్ధాన్ని తక్షణమే ఆపివేస్తుందని, తుది ఒప్పందం కోసం రాబోయే రెండు నెలల కాలంలో సంప్రదింపులకు వీలు కల్పిస్తుందని ఇరాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కజమ్‌ ఘరీబబాడీ తెలిపారు. ‘ఒప్పందంలో అమెరికా ఇచ్చిన హామీల అమలును పరిశీలించిన తర్వాతే తుది ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఇరాన్‌ విషయంలో శత్రుత్వాన్ని విడనాడతానని, ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేస్తానని, స్తంభిం పజేసిన ఆస్తులను విడుదల చేస్తానని అమెరికా హామీ ఇచ్చింది’ అని ఘరీబబాడీని ఉటంకిస్తూ తస్నిమ్‌ వార్తా సంస్థ తెలిపింది. ఒప్పందంపై సంతకాలు జరిగే శుక్రవారం నాడు ఇరు పక్షాలు తదుపరి చర్చలలో ప్రస్తావనకు వచ్చే అంశాలను నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు. ఎంఓయూను కుదుర్చుకోవడం అంటే శత్రువును నమ్ముతున్నామని కాదని, ఇచ్చిన హామీలను అమెరికా ఎలా నెరవేరుస్తోందో పరిశీలిస్తామని అన్నారు. కాగా ఒప్పందంపై ఇరాన్‌ సుప్రీం జాతీయ భద్రతా మండలి ఓ ప్రకటన చేస్తూ ‘ఒప్పందం ప్రకారం లెబనాన్‌లో సహా అన్ని రకాల సైనిక చర్యలు తక్షణమే, శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధనం కూడా పూర్తిగా ఆగిపోతుంది. అవగాహనా ఒప్పందంలో ఇచ్చిన హామీలను అవతలి పక్షం నెరవేర్చే వరకూ తుది ఒప్పందంపై సంప్రదింపులు జరగవు. ఒప్పందానికి సహకరించిన పాకిస్తాన్‌, ఖతార్‌ దేశాలకు ఇరాన్‌ కృతజ్ఞతలు తెలుపుకుంటోంది’ అని వివరించింది.

యుద్ధంలో చనిపోయిన ఇరాన్‌ కీలక నేతలు
మూడు నెలలకు పైగా మధ్య ప్రాచ్యంలో జరిగిన యుద్ధం ఎట్టకేలకు ముగి సింది. అయితే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు జరిపిన దాడులలో అనేక మంది కీలక రాజకీయ నేతలు, సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభం కాగా ఆ రోజే…తొలి గంటలోనే సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ దేశానికి సుప్రీం నేత అయ్యారు. అయితే ఆయన ఇప్పటి వరకూ ప్రజల ముందుకు రాలేదు. యుద్ధం కారణంగా అలీ ఖమేనీ అంత్యక్రియలు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. మార్చి 17న ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో ఇరాన్‌ సెక్యూరిటీ చీఫ్‌ లారీజానీ, ఆయన కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరం జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన 12 రోజుల యుద్ధంలో రివల్యూషనరీ గార్డ్స్‌ అధిపతి మహమ్మద్‌ పక్పర్‌ చనిపోయారు. యుద్ధంలో రివల్యూషనరీ గార్డ్స్‌ నౌకాదళ అధిపతి అలీరెజా తంగ్‌సిరి, సలహాదారు అలీ షమ్‌ఖానీ, ఇంటెలిజెన్స్‌ మంత్రి ఇస్మాయిల్‌ ఖతిబ్‌, రక్షణ మంత్రి అజిజ్‌ నసిర్‌ జాదెహ్, బసిజ్‌ కమాండర్‌ ఘోలమ్‌రెజా సొలైమని, గార్డ్స్‌ ప్రతినిధి అలీ మహమ్మద్‌ నైని, సైనిక కార్యాలయ అధిపతి మహమ్మద్‌ షిరాజీ, సాయుధ దళాల చీఫ్‌ అబ్దుల్‌రహీమ్‌ మౌసావీ కూడా చనిపోయారు. వీరే

ఆస్తుల విడుదలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు
ఎంఓయులోని కొన్ని అంశాలపై ఇరాన్‌, అమెరికాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశాయి. స్తంభింజేసిన ఇరాన్‌ ఆస్తులలో కొంత భాగాన్ని ముందుగానే విడుదల చేసేందుకు తాము ఆంగీకరించామంటూ వచ్చిన వార్తలను అమెరికా సీనియర్‌ అధికారి ఒకరు తోసిపుచ్చారు. ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించి అంకెలు, షరతులపై ఇరాన్‌ మీడియా, అమెరికాకు చెందిన పాత్రికేయులు భిన్న కథనాలు విన్పించారు. స్తంభింపజేసిన పాతిక బిలియన్‌ డాలర్ల ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందని ఎంఓయూలో పొందుపరిచారంటూ ఇరాన్‌ సీనియర్‌ అధికారి రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలియజేశారు. అమెరికాతో జరిగిన చర్చల వివరాలను ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తెలియజేస్తూ 14 సూత్రాల ఎంఓయూపై సంతకాలు జరిగిన తర్వాత ఇరాన్‌ ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందని తెలిపారు. నౌకాయానంపై అమెరికా విధించిన దిగ్బంధనం ఎత్తివేత ఎంఓయూలో తొలి అంశంగా ఉందని కూడా చెప్పారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తదుపరి దశ చర్చలలో ప్రస్తావిస్తామని అన్నారు. అయితే స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులను వాషింగ్టన్‌ విడుదల చేస్తుందంటూ వచ్చిన వార్తలను అమెరికా సీనియర్‌ అధికారులు, ఇతర అధ్యక్షభవనం వర్గాలు తోసిపుచ్చాయి. ఇచ్చిన హామీలను ఇరాన్‌ నెరవేర్చే వరకూ ఆస్తుల విడుదల జరగదని అవి స్పష్టం చేశాయి. అరవై రోజుల చర్చలు ప్రారంభం కావడానికి ముందు స్తంభింపజేసిన ఆస్తులను ఇరాన్‌ పొందలేదని చెప్పాయి.

ఆంక్షల ఎత్తివేతకు యూరోపియన్‌ దేశాల సంసిద్ధత
ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు యూరోపియన్‌ దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీర్ఘకాలిక దౌత్య పరిష్కారం కోసం అమెరికా, ఇరాన్‌, ప్రాంతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని చెప్పాయి. ఇదిలావుండగా తాజా పరిణామాల నేపథ్యంలో చమురు మార్కెట్లకు ఊరట లభించింది. టోక్యోలో చమురు ధరలు నాలుగు శాతం మేర తగ్గాయి. జపాన్‌లోని నిక్కీ స్టాక్‌ సూచిక మూడు శాతం వృద్ధిని నమోదు చేసింది.

స్వాగతించిన ప్రపంచ నేతలు
ఇరాన్‌-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఖతార్‌ ప్రధాని మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ బిన్‌ జాసిమ్‌ అల్‌-థానీ, బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌, టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనేస్‌, జపాన్‌ ప్రధాని తకైచీ తదితర నేతలు ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని నివారించడంలో ఇది ‘కీలక చర్య’ అవుతుందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ తెలిపారు. మధ్యవర్తిత్వం నెరపిన పాకిస్తాన్‌, టర్కీ, సౌదీ అరేబియా సహా పలు దేశాలను ఆయన అభినందించారు. కాగా ఒప్పందంలో తమ దేశాన్ని కూడా భాగస్వామిని చేసినందుకు లెబనాన్‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అవగాహన వాస్తవ రూపం దాలుస్తుందని, హింసకు ముగింపు లభిస్తుందని ఆశిస్తున్నామని లెబనాన్‌ అధ్యక్షుడు జోసఫ్‌ ఔన్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -