శ్రీలంక-ఏ చేతిలో భారత్-ఏ ఓటమి
సూపర్ ఓవర్లో వైభవ్, సూర్యాన్షు నిరాశ
భారత్-ఏ 265/10 శ్రీలంక-ఏ 265/9
దంబుల్లా (శ్రీలంక) : ఏ’ జట్ల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏకు మరో షాక్ తగిలింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్‌వర్త్ పద్దతిలో అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన కుర్రాళ్లు.. తాజాగా సూపర్ ఓవర్లలో ఆతిథ్య శ్రీలంక చేతిలో ఓటమి పాలయ్యారు. సూపర్ ఓవర్లో 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వైభవ్ సూర్యవంశీ (6), సూర్యాన్షు (3) విఫలమయ్యారు. తొలి మూడు బంతుల్లో సూర్యాన్షు మూడు పరుగులే చేయగా.. సూర్యవంశీ ఐదో బంతికి బౌండరీ బాదినా ఫలితం లేకపోయింది. అంతకుముందు అర్షద్ ఖాన్ వేసిన సూపర్ఓవర్లో అవిష్క ఫెర్నాండో సిక్సర్‌తో ఆ జట్టు 16 పరుగులు చేసింది. తొలుత 50 ఓవర్ల మ్యాచ్‌లో భారత్-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక-ఏ ఛేదనలో 50 ఓవర్లలో 9 వికెట్లకు 265 పరుగులు చేసింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావటంతో విజేతను సూపర్ ఓవర్‌తో తేల్చారు. వెలుతురు లేమితో సూపర్ ఓవర్‌పై సందిగ్థత నెలకొన్నా.. ఇరు జట్ల కెప్టెన్లతో చర్చించిన తర్వాత అంపైర్లు తగిన నిర్ణయం తీసుకున్నారు.
ఆదుకున్న సూర్యాన్షు, విప్రాజ్ :
శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ప్రభుసిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21), రుతురాజ్ గైక్వాడ్ (37), తిలక్ వర్మ (23), ఆయుశ్ బదొని (15), నిశాంత్ సింధు (6), అనుకూల్ రాయ్ (8) నిరాశపరిచారు. 143/7తో స్వల్ప స్కోరుకు పరిమితం అయ్యేలా కనిపించిన భారత్‌ను సూర్యాన్షు షెడ్జె (72, 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విప్రాజ్ నిగమ్ (51, 49 బంతుల్లో 6 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ఈ ఇద్దరు అర్థ సెంచరీలతో కదం తొక్కగా భారత్ 265 పరుగులు చేయగలిగింది. శ్రీలంక-ఏ బౌలర్లలో మహ్మద్ షిరాజ్ (3/33), విజయకాంత్ (3/26) మూడేసి వికెట్లతో మెరిశారు.
సమరవిక్రమ మెరిసినా.. :
పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. అయినా, సదీర సమరవిక్రమ (93, 113 బంతుల్లో 7 ఫోర్లు) ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. నిరోషన్ (37), అవిష్క ఫెర్నాండో (22), విశెన్ (17), సహాన్ (8), అహన్ (6)లను అవుట్ చేసినా.. సమరవిక్రమ ఓ ఎండ్ నుంచి పోరాడాడు. టెయిలెండర్లు విజయకాంత్ (18), గుణశేఖర (18) సైతం విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. ఆఖరు ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టి 4 పరుగులే ఇచ్చాడు. సమరవిక్రమ ఆఖరు ఓవర్ వరకు పోరాడినా.. ఆ జట్టును విజయతీరాలకు చేర్చలేదు.
సూపర్ చుక్కెదురు!
- Advertisement -
- Advertisement -



