నవతెలంగాణ – కామారెడ్డి : ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి మున్సిపల్ ప్రజలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీని ఇవ్వలేదు దీంతో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారింది. గత మూడు నాలుగు రోజులుగా ఎవరు చైర్ పర్సన్, ఎవరు వైస్ చైర్ పర్సన్ ఏ పార్టీ నుండి వస్తారని ప్రచారం జరిగింది. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక నిర్వహించాగా కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ నుండి 38వ వర్డ్ కౌన్సిలర్ ఇప్ప ఉమారాణి, కాంగ్రెస్ పార్టీకి చెందిన 49 వాడు కౌన్సిలర్ మహమ్మద్ ఇసాక్ ప్రతిపాదించగా, 1 కాంగ్రెస్ పార్టీ, 29వ వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ అంజద బలపరిచారు. ఓటింగ్ నిర్వహించగా ఉమారానికి అనుకూలంగా 33. ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె చైర్పర్సన్ ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
వైస్ చైర్మన్
వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 వార్డ్ కౌన్సిలర్ కాసర్ల గోదావరిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన 45వ వార్డు కౌన్సిలర్ పిట్ల వేణుగోపాల ప్రతిపాదించగా, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా ఆఫీస్ బెగ్ బలపరిచారు. ఓటింగ్ నిర్వహించగా 33 ఓట్లు వచ్చాయి దీంతో ఆమెను వైస్ చైర్మన్ గా ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కామారెడ్డి చైర్పర్సన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



