Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే ఆమోదించాలి

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే ఆమోదించాలి

- Advertisement -

ఐ లు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే ఆమోదించి, అమలు చేయాలని అత్తాపూరు చింతల్‌మెట్‌లోని తన కార్యాలయంలో జరిగిన అడ్వకేట్ ఖాదిర్‌పై జరిగిన దాడి  హత్య ను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్  రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా, యాదాద్రి భువనగిరి  జిల్లా వ్యాప్తంగా భువనగిరి రామన్నపేట ఆలేరు చౌటుప్పల్ యాదగిరిగుట్ట అన్ని కోట్లు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని ఇలాంటి దాడులు పునరావతం కాకుండా ఉద్యమాన్ని నిర్వహిస్తామని వారు అన్నారు.

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో న్యాయవాది ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్ లోని తన ఆఫీసులో ఉన్న సమయంలో ఖదీర్ పై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి పొడిచి చంపారు.ఖదీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.కుటుంబ కలహాలవల్ల ఖదీర్ ను అతని బావమరుదులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కుర్ర దాడిలో పాల్గొన్న నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే అరెస్టు చేయాలని, న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు.

న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఐలు జిల్లా కమిటీ అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఐలు జిల్లా గౌరవ అధ్యక్షులు కుక్క దువ్వ సోమయ్య, అధ్యక్షుడు బోల్లేపల్లి కుమార్, పాల్వంచ జగతయ్య, తడక నేహల్,రాజశేఖర్ రెడ్డి, శ్రీహరి, సీసా శ్రీనివాస్, బొడ్డు కిషన్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -