Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి సీతక్కను సన్మానించిన చల్వాయి కాంగ్రెస్ నాయకులు 

మంత్రి సీతక్కను సన్మానించిన చల్వాయి కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా మంత్రి దనసరి సీతక్క నీ చల్వాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చల్వాయి సర్పంచ్ మేకల రాధా సుదర్శన్ లు మాట్లాడుతూ.. ములుగు జిల్లా తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ సాధించిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని చరిత్రలో మునిసిపల్ తొలి చైర్మన్ పేరు నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్,యూత్ కాంగ్రెస్ నాయకులు తాటి శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -