నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్షిన అభ్యర్థులు విజయం సాధించి మంథని మున్సిపల్ చైర్మన్ గా ఒడ్నాల శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ గా ముస్కుల సహేoదర్ రెడ్డి లు సోమవారం అధిష్టానం, మంత్రి శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు ప్రమాణస్వీకారం చెసి, బాధ్యతలు చేపట్టారు. వారిని మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన, ఈజిస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ మర్యాపూర్వకంగా కలిసి బొకే అందజేసి, శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మంత్రి శ్రీదర్ బాబు బాధ్యతలు అప్పజెప్పిన 1వ వార్డు కుర్రు లింగయ్య, 2వ వార్డు నూకల కమల్ కాంగ్రెస్ పార్టీ బలపర్షిన అభ్యర్థులుగా గెలుపొంది, బాధ్యతలు చేపట్టారు. వీరికి కూడా సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
చైర్మన్, వైస్ ఛైర్మన్ లకు శుభాకాంక్షలు: దండు రమేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



