65 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో పని చేస్తూ, నేటికీ పాత్రికేయ రచనల్లో నిమగ్నులైన వాశిరాజు ప్రకాశంకు ఇటీవల అగ్రకథానాయకుడు చిరంజీవి తమ ఇంట్లో అరుదైన ఆత్మీయ సత్కారం చేశారు. వివిధ పత్రికల్లో సేవలు అందిస్తున్న పాత్రికేయులూ కన్నుల పండగగా జరిగిన ఈ వేడుకకు విచ్చేశారు. శ్శాలువ కప్పి, పుష్పగుచ్ఛంతో వాశిరాజును చిరు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ’65 ఏళ్ళుగా పత్రికలే తన లక్ష్యంగా, ఎంతో క్రమశిక్షణగా గడుపుతున్నారు వాశిరాజు.
ఇన్నేళ్ళుగా ఆయనతో నాకు అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేను. ఈ తీరని రుణం, బంధం అని మాత్రం చెప్పగలను’ అని అన్నారు. అంతేకాకుండా వాశిరాజుతో తనకి ఉన్న అరుదైన జ్ఞాపకాలను మెగాస్టార్ గుర్తు చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా వందేళ్ళ సినిమా చరిత్ర రచన తన లక్ష్యంగా ఉన్నట్లు వాశిరాజు తెలిపారు. చిరంజీవి, అనిల్‌రావిపూడి కలయికలో రూపొందిన ‘మన శంకర ప్రసాద్ గారు’ సినిమా అఖండ విజయం సాధించిన నేపథ్యంలో సీనియర్ పాత్రికేయులను చిరు సన్మానించారు.
అరుదైన ఆత్మీయ సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



