- Advertisement -
హెచ్‌పిఆర్‌సి పోలో చాంపియన్‌షిప్స్
హైదరాబాద్ : ఇంటర్నేషనల్ పోలో చాంపియన్‌షిప్స్ ‘సిక్స్ గోల్’ ఈవెంట్‌లో టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌పిఆర్‌సిలో జరిగిన తొలి సెమీఫైనల్లో జర్మనీపై భారత్ 12-3తో విజయం సాధించింది. తొలి చుక్కర్‌లో 4-0, రెండో చుక్కర్‌లో 3-0, మూడో చుక్కర్‌లో 5-3తో భారత్ అదరగొట్టింది. 9 గోల్స్ తేడాతో భారత్ గెలుపొందగా, బుధవారం ఫైనల్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -



