Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడ్లూరు చెరువు అలుగు మరమ్మతు పనులకు శ్రీకారం

అడ్లూరు చెరువు అలుగు మరమ్మతు పనులకు శ్రీకారం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజీపేట గ్రామ పరిధిలోని అడ్లూరు చెరువు అలుగు (వీర్) మరమ్మతు పనులకు మంగళవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ కంతి మధు పనులను ప్రారంభించి,శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు నియోజకవర్గ ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య ప్రత్యేక చొరవతో ఈ పనులు మంజూరయ్యాయని తెలిపారు.

మొత్తం రూ.47.50 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును షెడ్యూల్డ్ కులాల కేటగిరీ రిజర్వేషన్ కింద రూ.31,78,014 వ్యయంతో కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.రాబోయే మూడు నెలల్లో పనులను పూర్తిచేసి చెరువుకు పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.అడ్లూరు చెరువు అలుగు మరమ్మతు పనులు పూర్తయితే చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ దూల శ్రీధర్, 3వ వార్డు సభ్యుడు బండ శ్రీను, 6వ వార్డు సభ్యుడు కంతి బిక్షపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుక నాగరాజు, మదర్ డైరీ డైరెక్టర్ బత్తుల నరేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య, మాజీ ఉపసర్పంచ్ పుట్టల కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లచ్చ ఆంజనేయులు,నారా మల్లయ్య, పుట్టల స్వామి, ఐల ప్రభాకర్,చిలుకు శ్రీశైలం,మొరిగాడి శ్రీనివాస్, యూత్ నాయకులు దూడల సంతోష్,దూడల శ్రీను,దూడల మధు,దూడల అనిల్,పుట్టల గణేష్, బోదాసు నర్సింగ్,పుట్టల నరేష్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -