సూపర్ఎయిట్కు మాజీ చాంపియన్
ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలుపు
కోల్‌కతా : గ్రూప్ దశలో పడుతూ లేస్తూ ప్రయాస పడిన ఇంగ్లాండ్.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూపర్ఎయిట్కు అర్హత సాధించింది. సోమవారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో ఇటలీపై ఇంగ్లాండ్ 24 పరుగుల తేడాతో గెలుపొందింది. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఇంగ్లాండ్.. 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో వెస్టిండీస్ ఈ గ్రూప్ నుంచి ముందంజ వేశాయి. తొలుత ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 202 పరుగులు చేసింది. విల్ జాక్స్ (53 నాటౌట్, 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆ జట్టు 200 ప్లస్ పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (28), జాకబ్ బెతెల్ (23), టామ్ బాంటన్ (30), శామ్ కరణ్ (25)లు మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు.
105/5తో కష్టాల్లో పడిన ఇంగ్లాండ్‌ను విల్ జాక్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఛేదనలో ఇటలీ పోరాడినా.. ఓటమి తప్పలేదు. ఆంటోనీ (0), స్మట్స్ (0) నిరాశపరిచినా.. ఓపెనర్ జస్టిన్ (43, 34 బంతుల్లో 7 ఫోర్లు), బెన్ మానెటి (60, 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గ్రాంట్ స్టివార్ట్ (45, 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇంగ్లాండ్‌ను భయపెట్టారు. 20 ఓవర్లలో 178 పరుగులకు ఇటలీ ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో జెమీ ఓవర్టన్ (3/18), శామ్ కరణ్ (3/22), జోఫ్రా ఆర్చర్ (2/35), విల్ జాక్స్ (1/34) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన విల్ జాక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.



