Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంటాలిలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించిన ఉపాధ్యాయులు

కంటాలిలో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించిన ఉపాధ్యాయులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కంఠాలి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నాడు అక్షరాభ్యాస కార్యక్రమం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘణంగా జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ చిన్నారులను చూసి చాలా ఆనందంగా అనిపించిందని అన్నారు. ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి. ఇదే కంఠాలి ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఈరోజు టీచర్లు, హాస్టల్ వార్డెన్లు, ఇంజనీర్లు, డాక్టర్లు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలల్లో ఉన్నారు అని తెలిపారు. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే మంచి భవిష్యత్తు ఉండదనే మాట నిజం కాదని మన గ్రామమే నిరూపించింది అని పేర్కొన్నారు.

పిల్లల భవిష్యత్తు పాఠశాల పేరు మీద కాదు, వారి కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల బోధన మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచి విద్య, మంచి ఉపాధ్యాయులు, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అని సూచించారు. అందువల్ల ప్రైవేట్ పాఠశాలల వైపు మాత్రమే చూడకుండా, మన గ్రామ ప్రభుత్వ పాఠశాలను కూడా ఆదరించండి. అలాగే గ్రామ సర్పంచ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

మన బడి… మన గ్రామ గర్వం. ప్రభుత్వ బడి… పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట.అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -