Thursday, June 18, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ రీ-ఎగ్జామ్.. ప‌రీక్ష రాసేందుకు నిందితునికి అనుమ‌తి

నీట్ రీ-ఎగ్జామ్.. ప‌రీక్ష రాసేందుకు నిందితునికి అనుమ‌తి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వ‌హించ‌నున్న క్ర‌మంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పేప‌ర్ లీకేజీ కేసులో నిందితునిగా ఉన్న పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఉన్న యశ్‌ యాదవ్‌కు నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు హాజరయ్యేందుకు, అలాగే తన సోదరి వివాహ వేడుకలో పాల్గొనేందుకు కోర్టు అనుమతించింది. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు అని కామెంట్ చేసింది. నిందితుడిగా ఉన్నప్పటికీ నిందితుడి విద్యా అకాశాలను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. అందుకే కస్టడీలోనే కొనసాగిస్తూ యశ్ యాదవ్‌‌కు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా నిందితుడు పరీక్ష రాసేందుకు, కుటుంబ వేడుకకు హాజరవడానికి వీలుగా అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -