కొత్త విమానాశ్రయాల్లో కానరాని సౌకర్యాలు
కనెక్టివిటీ లేక ప్రయాణికుల ఇబ్బందులు
న్యూఢిల్లీ : సుదీర్ఘ విరామం తర్వాత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం వాణిజ్య విమానాలు కార్యకలాపాలు ప్రారంభించాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో నూతన విమానాశ్రయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భావిస్తోంది. దీనిపై ‘ది ఎకనమిస్ట్’ పత్రిక ఓ వ్యాసాన్ని ప్రచురించింది. దేశంలో విమానాశ్రయాల నిర్మాణం ఏ విధంగా జరుగుతోంది, ఈ విషయంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే విషయాలపై ఆ పత్రిక విశ్లేషణ జరిపింది. ప్రధాని మోడీ తన 12 సంవత్సరాల పాలనలో దేశంలో విమానాశ్రయాల సంఖ్యను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచారని, అయితే వాటిలో కొన్ని మూతపడ్డాయని, మరికొన్ని బాగా అభివృద్ధి చెంది విస్తరించాయని తెలిపింది. అయితే ప్రారంభించడంలో చూసిన ఆసక్తి, శ్రద్ధ వాటిని అభివృద్ధి చేయడంలోనూ, మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ కనబడడం లేదు. పత్రిక విశ్లేషణ ప్రకారం…ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కొన్ని విమానాశ్రయాలలో ట్రాఫిక్ పరిమితంగానే ఉంటోంది. ప్రారంభమైన తర్వాత అవి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పేదలు ఎక్కువగా నివసించే, బాగా అభివృద్ధి చెందిన సహరాన్‌పూర్ పట్టణంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తారని ఎవరూ అనుకోలేదు. అన్ని విమానాశ్రయాలు ఒకేలా ఉండవు. రోజుకు కేవలం ఒకటి రెండు విమానాలు మాత్రమే నడిచే ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. వాటిని చూస్తుంటే సాధారణ సౌకర్యాలు కూడా లేని షెడ్లు గుర్తుకు వస్తాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 164కు పెరిగింది.
ఇది అద్భుత విజయమే. విమానాశ్రయాల నిర్మాణంలో సవాలుతో కూడుకున్నది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఎన్నో విమానాశ్రయాలకు కనెక్టివిటీ సౌకర్యాలు లేవు. ఉదాహరణకు నోయిడా విమానాశ్రయం ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో అనుసంధానించి మల్టీ మోడల్ రవాణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాస్తవం ఏమంటే ఈ ఎయిర్‌పోర్టుకు వాహనంలో పోవచ్చు. లేదా నడచిపోవచ్చు. గత సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ప్రారంభించిన కొత్త ముంబయి విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి. అక్కడికి రాకపోకలు సాగించాలంటే ట్యాక్సీ తప్ప వేరే రవాణా సౌకర్యం లేదు. దాని కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. టెర్మినల్ ప్రారంభమైన తర్వాత చాలా కాలం వరకూ ఊబర్ కోసం ఫోన్ చేయడానికి సిగల్ కూడా లేదు. ఎయిర్‌పోర్ట్‌లో వైఫై కూడా సరిగా పనిచేయదు. విమానాశ్రయాల విషయంలోనే కాదు…ఆరంభంగా ప్రారంభించిన అనేక ఇతర ప్రాజెక్టులకు అతీగతీ లేకుండా పోతోంది.
ఆరంభ శూరత్వమే..
- Advertisement -
- Advertisement -



