కేంద్రం, రాష్ట్రాల స్పందన కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : భారత్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) జారీ చేసిన ఆధార్ కార్డులు పౌరసత్వం, స్థిర నివాసం, నివాసానికి రుజువు పత్రాలుగా దుర్వినియోగమవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, రాష్ట్రాల స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కోరింది. ‘చొరబాటుదారులు, అక్రమ వలసదారులు’ కూడా ఆధార్ కార్డులు పొందగలు గుతున్నారని, తమను తాము చట్టబద్ధమైన నివాసస్తు లుగా చూపించుకోగలుగుతున్నారని పిటిషన్ పేర్కొంది. తద్వారా వారు, చట్టబద్ధంగా తమకు అర్హత లేని ప్రయోజనాలను కూడా పొందగలుగుతున్నారని పిటిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై పెండింగ్‌లో వున్న ఇతర పిటిషన్లతో దీన్ని కలపాల్సిందిగా ఆదేశించింది.
పౌరసత్వ రుజువుగా ఆధార్ దుర్వినియోగం
- Advertisement -
- Advertisement -



