- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్యనే కిరాతకంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. మందమర్రి పట్టణానికి చెందిన మోయిన్, అవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్దిరోజులుగా వీరి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ పెద్దదవ్వడంతో ఆవేశానికి లోనైన అవంతి, ఇంట్లోని కత్తితో భర్త మోయిన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో మోయిన్ మృతి చెందాడు. భర్త వేధింపులే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితురాలు అవంతిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
- Advertisement -



