Monday, April 20, 2026
E-PAPER
Homeక్రైమ్ఆపరేషన్‌ అక్టోపస్‌ - 2.0 పేరుతో 9 రాష్ట్రాల్లో సోదాలు

ఆపరేషన్‌ అక్టోపస్‌ – 2.0 పేరుతో 9 రాష్ట్రాల్లో సోదాలు

- Advertisement -

భారీ సైబర్‌ మోసాల
నెట్‌ర్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు
నేరగాళ్లతో బ్యాంకు అధికారుల కుమ్మక్కు
52 మంది నిందితుల అరెస్ట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్‌ అక్టోపస్‌ – 2.0′ పేరుతో 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలువురు బ్యాంకు అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు. పెట్టుబడి స్కాంలు, ట్రేడింగ్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్టు పేరుతో అమయాకులను బెదిరించిన నేరగాళ్లు భారీగా సొమ్మును దోచుకున్నట్టు గుర్తించారు. సైజర్‌ ముఠాకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఆపరేషన్‌ కొనసాగినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో 32 మంది బ్యాంకు ఆధికారులు, ఐదుగురు మీడియేటర్లు తదితరులు ఉన్నారు. నేరగాళ్లతో కుమ్మక్కైన బ్యాంకు అధికారులు.. అక్రమంగా వారికి ఖాతాలు తెరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో 16 ప్రత్యేక బృందాలు పాల్గొనగా.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయని, బాధితుల సొమ్మును మళ్లించేందుకు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్టు తెలిపారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా సుమారు 850 సైబర్‌ కేసులతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. మొత్తం సుమారు రూ.150 కోట్ల మేర మోసం జరిగినట్టు పోలీసు అధికారులు నిర్ధారించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -