నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారము లైన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో పలస అంజయ్య జ్ఞాపకార్థం కుమారుడు పలస రాంబాబు సునీత దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్ మాట్లాడారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకు, రోగులకు, బంధువులకు సుమారు 100 మందికి భోజన వసతి కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సమాజసేవే లక్ష్యంగా లైన్స్ క్లబ్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారి జమున, లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ రెడ్డిపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, ఉపాధ్యక్షుడు కల్లూరి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ పోగుల రాములు, సభ్యులు ఉమాపతి, సోమేశ్వర్, నందకుమార్, వైద్య సిబ్బంది ఆశ వర్కర్లు ఉన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్నదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



