Wednesday, June 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలు"సర్" పేరుతో తెలంగాణలోనూ ముస్లీం ఓట్లు తొలగించే కుట్ర: మంత్రి అజారుద్దీన్

“సర్” పేరుతో తెలంగాణలోనూ ముస్లీం ఓట్లు తొలగించే కుట్ర: మంత్రి అజారుద్దీన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను ఉపయోగించి ముస్లింల ఓట్లను తొలగించే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి అజారుద్దీన్… ‘సర్’ అందరికీ వర్తించే అంశమే అయినా, ముస్లింల ఓట్లనే టార్గెట్ చేస్తారు అని ఆరోపించారు.

పశ్చిమబెంగాల్, బీహార్‌లలో ముస్లింల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తెలంగాణలోనూ అలాంటి కుట్రలు జరగవచ్చని హెచ్చరించారు. ‘సర్’ ప్రక్రియలో తొలగించే ఓట్ల మీదే ఎన్నికల ఫలితాలు ఆధారపడతాయని, ప్రజలు తమ ఓట్లను స్వయంగా కాపాడుకోవాలని మంత్రి సూచించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -