Wednesday, June 17, 2026
E-PAPER
Homeఖమ్మంట్రాయల్ ట్రాక్టర్ చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

ట్రాయల్ ట్రాక్టర్ చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

- Advertisement -

– వివరాలు వెల్లడించిన సీఐ నాగరాజు రెడ్డి 
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని నారాయణపురం గ్రామంలో ఈ నెల 13 న నమోదైన ట్రాయల్ ట్రాక్టర్ చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అశ్వారావుపేట లోని పాపిడిగూడెం రోడ్ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.

అరెస్ట్ అయిన నిందితులు:
కట్టూరి సుందరబాబు, పి. అంకంపాలెం గ్రామం, జిలుగుమిల్లి మండలం, ఏలూరు జిల్లా.

జక్కుల చిన్ని అలియాస్ నాగేశ్వరరావు, నారాయణపురం గ్రామం, అశ్వారావుపేట మండలం. నరదల ప్రసాద్, నారాయణపురం గ్రామం. పోలీసుల విచారణలో నిందితులు జల్సాలకు అలవాటు పడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒంటరిగా పార్క్ చేసిన ట్రాక్టర్ల విడిభాగాలను దొంగిలిస్తున్నట్లు అంగీకరించారు. బత్తుల నాగేశ్వరరావుకు చెందిన ట్రాయల్ ట్రాక్టర్ ను గతంలో చోరీ చేసి అంకంపాలెం గ్రామంలోని ఓ పామాయిల్ తోటలో దాచిపెట్టినట్లు తెలిపారు.

దాచిన ట్రాయల్ ను ట్రాయల్ ట్రాక్టర్ ఇంజన్ సహాయంతో బయటకు తీసి సత్తుపల్లిలో విక్రయించాలని యత్నిస్తున్న సమయంలో పాపిడిగూడెం మీదుగా అశ్వారావుపేటకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితులు మరో ట్రాయల్ ట్రాక్టర్ తో పాటు డబుల్ బ్లేడ్ డిస్క్‌ను కూడా దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన ట్రాయల్, డబుల్ బ్లేడ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను దమ్మపేట మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల చాకచక్యంతో చోరీ కేసు త్వరితగతిన ఛేదించబడటంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. కార్యక్రమంలో ఎస్ హెచ్ ఓ యయాతి రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -