- Advertisement -
ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
నిరుపేద ప్రజల గ్రామీణ వైద్యుడు ఎరుకొండ సాంబన్నని, ఆయన అందించిన సేవలు మరువలేనివని ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, జిల్లా నాయకుడు జంబోజు రవిందర్ అన్నారు. సాంబయ్య అనారోగ్యంతో మృతిచెందారు. బుధవారం సాంబయ్య స్వగ్రామం జంగెడులో పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుమార్ యాదవ్, రవిందర్ హాజరై మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సాంబయ్య ఆర్ఎంపీ సంఘానికి, నిరుపేద ప్రజలకు అందించిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. ఆయన అకాల మరణం సంఘానికి తీరని లోటన్నారు.
- Advertisement -



