Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చర్ల అంకిరెడ్డిపల్లిని సందర్శించిన గ్రూప్-1 అధికారులు

చర్ల అంకిరెడ్డిపల్లిని సందర్శించిన గ్రూప్-1 అధికారులు

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు
గ్రూప్ వన్ అధికారులు ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు,సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.గ్రామంలోని పలు వాడలను తిరిగి పరిశీలిస్తూ, రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు సేకరించారు.

స్థానిక ప్రజలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు, సూచనలును తీసుకున్నారు.ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ద్వారా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం ట్రైనింగ్‌లో కీలక భాగమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.కార్యక్రమంలో ట్రైనీ అధికారులు జెస్సీ పౌల్ సురారపు,బోయ ఉజ్వల,బానోతు నరేందర్,సాత్విక్ నాయక్,నిఖిల, నికిత రెడ్డి, ప్రణయ్ సాయి మాట్లాడారు.

వారి వెంట సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ నాగరాజు, తహాశీల్దార్ సలీం, ఎంపీడీవో జనార్ధన్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ బ్రహ్మం, వెటర్నరీ వైద్యాధికారి మంజుల, వ్యవసాయ శాఖ మండల అధికారి జయంత్ కుమార్, ఎఎస్ ఐ వెంకట్ గౌడ్,ఏపిఎం శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శులు  ఆయా శాఖల అధికారులు,, గ్రామస్తులు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -