- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
అగ్ని ప్రమాదాల నివారణ చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉష కుటుంబ సభ్యులు సంతోష్ మేస్త్రి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ మేస్త్రీ మాట్లాడుతూ.. ప్రమాదాలు ఎక్కడ జరిగినా క్షణాల్లో చేరుకొని ప్రమాద నివారణ చర్యలు చేపట్టడంలో అధికారుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ముగింపు సభలో అగ్నిమాపక అధికారి నర్సింలు, సిబ్బంది ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారని తెలిపారు. అనంతరం అధికారులు సర్పంచ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అగ్నిమాపక వారోత్సవాలు విజయవంతమయ్యాయని అన్నారు. ఇందుకు మీ సహకారం మరువలేనివని అధికారులు తెలిపారు.
- Advertisement -



