Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ బిల్లులు మంజూరు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు

ఇందిరమ్మ బిల్లులు మంజూరు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇండ్లు. అయితే మండల పరిధిలోని పెద్ద తడుగూర్ కు చెందిన షేక్ రోషన్ కు మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. ఇందిరమ్మ అప్లికేషన్ నెం.209582/5509827. లబ్దిదారులు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు చేపట్టారు. కానీ రావాల్సిన బిల్లులు నెలలు గడుస్తున్నా రావడం లేదు. ఈ విషయమై వారు జీపీ కార్యదర్శికి, సర్పంచ్ కూడా విన్నవించినా స్పందన లేదు. దీంతో ఇక చేసేదేమీ లేక సోమవారం ప్రజావాణిలో బాధితులు తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మాకు ఇందిరమ్మ బిల్లులు రావడం లేదని, మా సమస్యను పరిశీలించి, బిల్లులు మంజూరు చేయించగలరని అందులో వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -