Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దర్పల్లిలో ఘనంగా కేసీఆర్, బాజీరెడ్డిల జన్మదిన వేడుకలు 

దర్పల్లిలో ఘనంగా కేసీఆర్, బాజీరెడ్డిల జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి 
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రూరల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ ఆర్టీసీ చేర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ గార్ల పుట్టినరోజు సందర్బంగా మండల వ్యాప్తంగా బిఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా మండలకేంద్రములో మాజీ ఎంపిపి నల్ల సారిక హన్మంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కస్తూరిబ పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం విద్యార్థులకు, స్వీటు, పండ్లు పంపిణి చేశారు. దుబ్బాకలో ఉపసర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రామడుగు సర్పంచ్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మైలారంలో మాజీ సొసైటీ చేర్మెన్ రాజేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించారు. సీతాయిపేట గ్రామములో భూమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .తమ ప్రియతమా నాయకులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆపై భాగంతునితో ఆకాంక్షించారు. కార్యక్రమములో నాయకులు పీసు రాజపాల్, కిషోర్ రెడ్డి, నజీర్ ఆహేమద్, అబ్దుల్ మజీద్, సభవత్ శ్రీనివాస్, గూండ్ల మోహన్, శంకర్ నాయక్, రాజేష్ నాయక్, ఎస్పీ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -