Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫిబ్రవరి 19న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలుగు టాలెంట్ టెస్ట్

ఫిబ్రవరి 19న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలుగు టాలెంట్ టెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఏడవ తరగతి మరియు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే తెలుగు సబ్జెక్టులో టాలెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఖండేబల్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్ మండలంలోని ఆరు మరియు ఏడవ తరగతి చదువుతున్న 15 ప్రాథమికోన్నత పాఠశాలలోని ప్రతి యుపిఎస్ పాఠశాల నుండి ఇద్దరు  విద్యార్థిని , విద్యార్థులకు , అదేవిధంగా ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్క పాఠశాల నుండి ఎంపిక చేసిన ఇద్దరు , విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్కరిని ఎంపిక చేసి టాలెంట్ పరీక్షకు హాజరుకావాలని కోరారు.

తెలుగు సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయులైన కోఆర్డినేటర్ రవి మరియు కాసింల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఖండేబల్లూర్ క్లస్టర్ హెచ్ఎం  తెలిపారు.  ఈనెల 19వ తేదీన ఉదయం 10:30 ని”లకు టాలెంట్ పరీక్షలు ప్రారంభం అవుతాయని ప్రతి జెడ్ పి హెచ్ ఎస్ మరియు యుపిఎస్ పాఠశాలలో నుండి ఇద్దరు వేసి టాలెంట్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనాలని సూచించారు. గెలుపొందిన వారికి ఏడవ తరగతి మరియు 10వ తరగతి విభాగాలలో ప్రథమశ, ద్వితీయ , తృతీయ , బహుమతులు అందించడం జరుగుతుందని  పేర్కొన్నారు. టాలెంట్ పరీక్షల బ్రోచర్లు విడుదల చేసిన కార్యక్రమంలో జుక్కల్ మరియు ఖండేబల్లూర్ క్లస్టర్ హెచ్ఎంలు హనుమంత రెడ్డి , లాలయ్య, ఉపాధ్యాయులు వై. శ్రీనివాస్ , వై. జనార్ధన్ , గంగయ్య అప్ప, కాసిం, రవి, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -