Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వార్డు సభ్యులకు శిక్షణ

నూతన వార్డు సభ్యులకు శిక్షణ

- Advertisement -

నవతెలంగాణ-కోహెడ  
కోహెడ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పరిపాలన, బాధ్యతలు, విధులపై సమగ్ర అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జీ. కృష్ణయ్య అన్నారు.

అనంతరం ఎంపీఓ రవీందర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, టీవోటీలు బాలాజీ, అశోక్ కుమారస్వామి, మాధవి వారు వార్డు సభ్యులకు గ్రామ పరిపాలనలో అనుసరించాల్సిన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాలపై వివరించారు. శిక్షణ కార్యక్రమం మొదటి బ్యాచ్‌లో కోహెడ, సముద్రాల, ఆరేపల్లి, బస్వాపూర్, బత్తులవానిపల్లి, సీసీ పల్లి, ధర్మసాగర్ పల్లి, ఎర్రగుంటపల్లి, గోట్ల మిట్ట, కాచాపూర్ గ్రామపంచాయతీలకు చెందిన నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామాభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -