చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
నవతెలంగాణ – ఆలేరు టౌను
విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదిగేందుకు, ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యాలాద్రి, ఇందిరా ప్రియదర్శిని అవార్డు గ్రహీత డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం వెంకటరమణ జూనియర్ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ, కళాశాల ప్రిన్సిపల్ నాలం అయ్యప్ప ఆధ్వర్యంలో, పట్టణంలోని పద్మావతి గార్డెన్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల విశ్రాంత విద్యాధికారి పటేల్ సుధాకర్ రెడ్డి, కళాశాల చైర్మన్ కటకం నందం జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా వచ్చే సమాచారం నమ్మవద్దని,చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు. రోడ్డు నిబంధనలకు అనుగుణంగా యువత, రోడ్లపై వాహనాలు నడిపే వారు జాగ్రత్తలు తీసుకోవాలని, వేగం వద్దు ప్రాణం ముద్దు అని చెప్పారు. విధ్యార్థులు రాబోయే వార్షిక పరీక్షలో మంచి మార్కులు పొందేందుకు కృషి పట్టుదలతో విద్యను అభ్యసించాలని కోరారు. గురువుల విద్యాబోధన సూచనలకు అనుగుణంగా విద్యపై పట్టు సాధించాలన్నారు. సంకల్పంతో పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.
మాజీ మండల విద్యాధికారి పటేల్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని కోరారు. చదువు సంస్కారం అనేది అందరికీ ఉండాలని, విఆర్ కాలెజి అంటేనే, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తుందన్నారు . నేటి తరంలో స్కాలర్షిప్ రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కాలేజి ను ముందుకు వెళ్ళడం గర్వించదగిన విషయమా ని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి బయటకి వెళ్లకుండా ఆలేరు పరిసర ప్రాంతాల వారికి ఉత్తమ ఫలితాలు సాధించాలని ,కాలేజీని స్థాపించడం అభినందనీయమని పేర్కొన్నారు.
డబ్బుంటేనే రాజకీయం అనే తీరు మార్చాలని సూచించారు. కాలేజి చైర్మన్ నందం మాట్లాడుతూ విధ్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. గత సంవత్సరం లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ,అతిథులచే శీల్దు అందించారు. ఆహ్వానితులను కాలేజి ప్రిన్సిపాల్ నాళం అయ్యప్ప శాలువాలతో మేమేంటోలతో సన్మానించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో, నృత్యం చేస్తూ అలరించారు.
ఈ కార్యక్రమం లో అధ్యాపకులు ఉప్పలి రాజు, పరుషరాములు, మానస, మధుసూదన్, వీరాచారి, కమలాకర్, సునంద, కృష్ణ కుమార్, ఉపాచారి, రమేష్, ఇందిర, లావణ్య, సుభాష్, సుభాష్, నమేర జాస్మిన్, పటేల్ వంశి రెడ్డి, సింధు, నర్మదా, భార్గవి, మాధవి తదితరులు పాల్గొన్నారు.



