సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్
నవతెలంగాణ-తుంగతుర్తి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని తుంగతుర్తి సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకై పార్లమెంట్లో అనేక పోరాటాలు చేసిన ఘనత రాజగోపాల్ రెడ్డిది అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులను పూర్తిగా నిర్మూలన చేసి ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. నిరంతరం పేద ప్రజల అభ్యున్నతి కోసం పరితపించే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



