Thursday, June 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

- Advertisement -

సీఐటీయూ మున్సిపల్ కార్మికుల సంఘం, హనుమకొండ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి
నవతెలంగాణ – పరకాల 
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయూ మున్సిపల్ కార్మికుల సంఘం, హనుమకొండ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి, పరకాల అధ్యక్షులు మడికొండ ప్రమోద్ కుమార్ డిమాండ్ చేశారు. పరకాల పాత మున్సిపాలిటీ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు గురువారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మున్సిపాలిటీల్లో 22 వార్డులను పరిశుభ్రంగా ఉంచుతూ, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని మండిపడ్డారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు శాశ్వత పనుల వద్ద పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు. 60 ఏళ్లు పైబడిన వారు, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులు ఎవరైనా మరణిస్తే వారి దహన సంస్కారాల కోసం రూ. 30 వేల ఆర్థిక సాయం అందించాలని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని కోరారు. సొంత ఇళ్లు లేని నిరుపేద కార్మికులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని పక్షంలో దశలవారీగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ మేరకు ఈ నెల 22న కలెక్టర్ కార్యాలయం ముందు, 29న ఎమ్మెల్యే నివాసం వద్ద, 30న మంత్రి నివాసం వద్ద నిరసనలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లాలు, కరెంటు, శానిటేషన్ సిబ్బంది, జవాన్లు పాల్గొన్నారు. రిలే దీక్షలో బొచ్చు ఐలయ్య, చెరుకు నాగరాజు, మంద మహేష్, కోకిల సుమన్, గుర్రం సరోజన, మడికొండ వసంత, దుప్పటి తిరుమల, ఒంటేరు సరోజన, బొచ్చు సురేష్, ఒంటేరు సాంబయ్య, బొచ్చు దేవయ్య, ఒంటేరు సారయ్య, ఒంటేరు విజయ్, ఒంటేరు అశోక్, పసుల వసంత, చిలువేరు శుభకాల మల్లికాంబ, సుక్క కమల, రత్న జీవన్ కుమార్, ఒంటేరు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -