Thursday, July 9, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసరలో బాలాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన

బాసరలో బాలాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన

- Advertisement -

దేవదాయ శాఖ నుంచి వచ్చిన స్థపతి ఆర్కిటెక్ బృందం
నవతెలంగాణ – ముధోల్ 

బాసర ఆలయ అభివృద్ధి పనులు వచ్చే నెలలో ప్రారంభించేందుకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర దేవదాయ శాఖకు చెందిన స్థపతీ మోతిలాల్, ఆర్కిటెక్ మాధవి బృంధం ఆలయ ఈఓ అంజనీ దేవితో, ఆలయ స్థానాచార్యుడు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి కలిసి ఆలయంలోని 150 రూపాయల అక్షరాభ్యాస మండపాన్ని పరిశీలించారు. బాలాలయం ఏర్పాటు, వెయ్యి రూపాయల ప్రత్యేక అక్షరాబ్యాస మండపం, 150 రూపాయల అక్షరాబ్యాస మండపం, క్యూ లైన్ ఏర్పాట్లను పరిశీలించి ఆలయ అధికారులకు, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ సంజీవరావు  అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -