Thursday, June 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్ర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్ర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు,గదుల నిర్మాణం,అవసరమైన ఫర్నిచర్,మహిళలు మరియు చిన్నారులకు అందించనున్న సేవలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.మహిళలు,చిన్నారుల సంక్షేమం, సాధికారతకు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు.కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన,మహిళలు,చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.ఈ పరిశీలనలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,ఆలేరు ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -