Friday, June 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై తులసి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తున్న బస్సు రేగుపాలెం జంక్షన్ వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -