Saturday, June 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఎన్నికల వ్యవస్థ మూలాలు - మూడు ముప్పులు

ఎన్నికల వ్యవస్థ మూలాలు – మూడు ముప్పులు

- Advertisement -

భారత రాజ్యాంగ నిర్మాణం ప్రజాస్వా మ్యాన్ని ఆచరణలో పెట్టేందుకు అపూర్వమైన స్థాయిలో సాగిన ఒక బృహత్తరమైన కసరత్తు అని బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు సర్ ఆంటోనీ ఎడెన్ ఒకసారి అంగీకరించారు. ‘అదేదో కేవలం పాశ్చాత్య దేశాల నమూనాలను మక్కీకి మక్కీగా అనుకరించడం కాదు. చెప్పలేనంత గొప్ప అంతర్జాతీయ ప్రభావం ప్రసరించిన సాహసోపేత ప్రజాస్వామ్య ప్రస్థానం అది. భారత దేశపు కృషి కేవలం మన దేశంలో చేస్తున్నదానికి పేలవమైన అనుకరణ కానే కాదు. మనమెప్పుడూ ఊహించని స్థాయిలో దాన్ని బహురూపాల విస్తరించి అమలు చేసిన ప్రయత్నం భారత దేశానిది’ అని ఆయన అన్నారు. చాలా దుర్లభమైన వైవిధ్యం నిండిన విస్తార జనాభాను ఏకీకరణ జరపడంలో దాగివున్న చారిత్రాత్మక సవాళ్లను కూడా ఆయన గుర్తించారు. ఇది గనక జయప్రదం అయ్యేట్టయితే ఆసియాలో మేలు చేసే రీతిలో అగణితమైన మంచి చేస్తుందని కూడా ఆయనన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పన చేస్తున్నవారి ఉద్దేశాల పట్ల ఎడెన్ ప్రగాఢమైన గౌరవం ప్రకటించారు.

భారత రాజ్యాంగం గురించిన ఈ ప్రస్తావనలు ఈ సమయంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుం టున్నాయి. ప్రస్తుత సంధి దశలో ఎదురవుతున్న సవాళ్లను ఢీకొనడంలో వాటికి చాలా ప్రాముఖ్యత ఏర్పడు తుంది. ఇప్పుడు భారత దేశాన్ని ఏలుతున్న కాషాయ కార్పొరేట్ కూటమి మన రాజ్యాంగపు మౌలిక లక్షణాలనే విచ్ఛిన్నం చేయజూస్తున్నది. ప్రస్తుత పరిపాలనకు బాధ్యత వహిస్తున్న వారికీ రాజ్యాంగం కోసం జరిగిన ఆనాటి కసరత్తుతోనూ, దాని వెనకనున్న స్వాతంత్య్ర పోరాటంతోనూ ఏ కోశానా సంబంధం లేకపోవడం యాదచ్ఛికమేమీ కాదు. భారత ప్రజాస్వామ్యపు మౌలిక చట్రాన్ని నెలకొల్పే సందర్భంలో ఈ దేశంలోగల సుసంపన్నమైన వైవిధ్యం, అపార జనాభాను పరిగణనలోకి తీసుకోవ లసి వుంటుంది. మెజారిటీ వాదం (అధిక సంఖ్యా కుల వాదం) అన్నది తలెత్తకుండా చేయడమే అతి పెద్ద సవాలు. ఆ విధంగా అది సమ్మిళిత ప్రజాస్వామ్యంగా మాత్రమే వుండక తప్పదు.

మూల సూత్రాలకే ఎసరు
అయితే ఈ కాషాయ కార్పొరేట్ కూటమికి మూలాధారంగా వున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీనంతటికీ నాయకత్వం వహిస్తున్నదనేది వాస్తవం. తన వాస్తవిక భౌతిక ఉనికికి సంబంధించిన అంశాలను వెల్లడించి స్వచ్ఛత చూపుకోవడానికి ఆరెస్సెస్ నిరాకరించడమే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది. జవాబుదారీ తనం అంటేనే దానికి ఎంత విముఖతో వెల్లడవు తుంది. నిజానికి భారత దేశ పౌరులకు కార్యనిర్వాహక వర్గం జవాబు దారుగా వుండాలనే విషయంలోనే రాజ్యాంగం అత్యధిక శ్రద్ధ తీసుకుంది. కనుక దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రధాన భూమిక స్వతంత్రమైన పారదర్శ కమైన బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రమే. దాన్ని స్వయం ప్రతిపత్తి గల భారత ఎన్నికల సంఘం మొత్తంగా పర్యవేక్షిస్తుంది. ఇసిఐ స్వతంత్రతకు అవరోధాలుగా నిలిచే అంశాలన్ని టినీ తొలగించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఒక రాజ్యాంగ సంస్థగా ఇసిఐ రాజ్యాంగ నిర్మాణ స్ఫూర్తికీ పౌరుల హక్కులకూ కట్టుబడి వుంటుందనే అంచనాతోనే ఇలా చేయడం జరిగింది.
సరిగ్గా ఈ విషయంలోనే ఇటీవలి మొత్తం ప్రక్రియకు కళంకం తెచ్చే పరిణామాలు ఇటీవల జరిగాయి. అసలు ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతే తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణదారుగా, కార్యనిర్వాహక వర్గం, శాసనవ్యవస్థ గీత దాటకుండా వాటిని కాపాడవల సిన బాధ్యతను నిర్వహించాల్సిన న్యాయ వ్యవస్థ విఫలమవు తున్నది.

రాజ్యాంగ మౌలిక లక్షణాలనే వాటిని కాపాడలేకపోతున్నది. ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుతంగా న్యాయంగా వుండాలంటే సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు అనేది కనీస ప్రాథమిక అవసరం. ఇసిఐ అధికారాలను పున:పటిష్టం చేసే క్రమంలో రాజ్యాంగం ఓటు హక్కును కూడా సమానంగా నొక్కి చెప్పింది. దాన్ని కాపాడటానికే ఎక్కువ మొగ్గు చూపించింది. ఓటరు జాబితాల సమగ్ర ప్రత్యేక పరిశీలన ‘సర’ పేరిట ఇసిఐ 2025 జూన్‌లో మొదట బీహార్‌లో ప్రారంభించి…తర్వాత మరో 12 రాష్ట్రాలకు దాన్ని విస్తరించి…రాజ్యాంగ బద్ధమైన పౌరుల ఓటింగు అనే ప్రాథమిక హక్కు పైనే వేటు వేస్తున్నది. ఓటర్ పౌరసత్వాన్ని పరిశీలించే హక్కు ఇసిఐ కి వున్నప్పటికీ దాన్ని నిర్ధారించడం ఇసిఐ పరిధిలో వున్న పనికాదు. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు ఈ తేడా ఏమిటో సుస్పష్టంగా పేర్కొన్నది. కానీ తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లను జాబితా నుంచి తొలగించక పోయినప్పటికీ అనిశ్చితిలో అట్టిపెట్టింది.

ఇంకా నిర్ధారణ కోసం నిరీక్షణ జాబితా అనే వింత విభాగం ఒకటి కొత్తగా సష్టించింది. న్యాయ పరిభాషలో చెప్పాలంటే ఇది నిస్సందే హంగా రాజ్యాంగ హక్కుల నిరాకరణే. పైగా తర్వాత న్యాయ ట్రిబ్యునళ్ల ద్వారా కొద్ది మందిపై వెలువడిన తీర్పులు అనుకూలంగా వున్నాయి. వారికి ఓటు హక్కు వున్నదని తేలడం బట్టి చూస్తే ఈ నిరాకరణ మరింత బాగా అర్థమవుతుంది. స్వేచ్ఛాయుతమైన న్యాయమైన రీతిలో ఎన్నికలు జరపడానికి ఓటరు జాబితా మొదటి ప్రాథమికావసరం. ఎన్నికల సంఘం చాలా గట్టిగా అత్యధిక ప్రజల ఓటింగు హక్కును తీసేస్తున్నప్పుడు, ఉన్నత న్యాయ వ్యవస్థ ఓటరు రాజ్యాంగ హక్కును కాపాడలేక పోయినప్పుడు కలిగే నష్టం చాలా తీవ్రంగా వుంటుంది. ‘సర’ ప్రక్రియ సమ్మిళిత ఓటరు జాబితా వుండేట్టు చూడటంలో విఫలమైం దనే ఆరోపణ కూడా ఎదుర్కొనవలసి వచ్చింది. జనాభాలో సామాజిక ఆర్థిక మత పరమైన హక్కులు పక్కకు నెట్టివేయబడ్డాయి.

పోటీ హక్కుపై దాడి
ఏ ఒక్క రాజకీయ పార్టీ పట్ల పక్షపాతం లేకుండా చూడటం అన్నది స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల ప్రక్రియలో రెండో ప్రాథమికా వసరం. మధ్య ప్రదేశ్‌లో తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల నిర్వహణ సందర్భంలో రిటర్నింగ్ అధికారి మున్నెన్నడూ ఎరగని ఒక చర్యకు పాల్ప డ్డారు. ఒక అభ్యర్థి నామినేషన్‌తో పాటు సమర్పిం చిన అఫిడవిట్‌లో సమాచార లోపాలు వున్నాయనే కారణంతో ఆ రిటర్నింగ్ అధికారి అసలు ఆమె నామినేషన్‌నే తిరస్కరించారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో ఇచ్చిన తీర్పును బట్టి చూస్తే ఆ సమా చార లోపం అనేది కేవలం పాలక బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా మాత్రమే సృష్టించబ డిందని తేలింది. ఈ సందర్భంలోనూ ఉన్నత న్యాయస్థానం ఇసిఐ స్వతంత్రత గురించే ఆందోళన పడింది తప్ప రిటర్నింగ్ అధికారి పచ్చిగా పక్షపాతం ప్రదర్శిం చడాన్ని చక్కదిద్దలేదు. ఒక అభ్యర్థికి పోటీ చేసేందుకు గల హక్కును కాపాడలేదు. అభ్యర్థులు తాము ఏ పార్టీ గుర్తుపై ఓటర్ల ముందుకు వెళ్లి దాని విధానం, కార్యక్రమాల మేరకు పోటీ చేసి విజయం సాధించారో ఆ పార్టీనే చట్టసభలో బలపర్చేలా చూడటం ఎన్నికల వ్యవస్థకు వుండాల్సిన మూడవ అవసరం. అయితే ఈ సూత్రాన్ని పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్, లోక్‌సభ స్పీకర్ భారీ ఎత్తున ఉల్లంఘించారని తలకిందులు చేశారనీ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భవిషత్తులో చేయబోయే శాసనాలకు మరీ ముఖ్యంగా పునర్విభజన ప్రక్రియ నెలకొల్పేందుకు సంబంధించిన చట్టాల ఆమోదంపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నది.

ఫిరాయింపులతో తారుమారు
మొత్తంపైన బహుళ పార్టీ ఎన్నికల వ్యవస్థపై ఆధారపడిన ప్రజాస్వామ్య పునాదులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. పాలక పార్టీగా వున్న బిజెపి పంజాతో, కోరలతో ఎలాంటి గట్టి ప్రజాస్వామిక ప్రతిపక్షమనే ప్రసక్తి లేకుండా రాజకీయ వ్యవస్థను ‘శుద్ధి” చేయాలనుకుంటున్నది. భారత దేశ నేపథ్యంలో చూస్తే దీనివల్ల వైవిధ్యాన్ని నేలమట్టం చేసే మరో ప్రమాదం కూడా వచ్చిపడుతుంది. ఏకపక్ష ఆధిపత్య విధానం రుద్దబడే ప్రమాదమేర్ప డుతుంది. 21వ శతాబ్దంలో ఇది ఎంతమాత్రం పొసిగే వ్యవహారం కాదు. దుందుడుకుగా వచ్చిపడు తున్న కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకత మయ్యే ఈ నయా ఉదారవాద నమూనా నయా ఫాసిస్టు లక్షణాలకు అచ్చమైన ప్రతిరూపంగా వుంటుంది. ప్రజాస్వామ్యాన్ని కుదుళ్లతో సహా విస్థాపితం చేసే ఈ ప్రమాదాన్ని వెనక్కు కొట్టాలంటే ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్యతత్వం, సామాజిక న్యాయం కోరే శక్తులందరూ అత్యంత విశాల ప్రాతిపదికన ఏకమై పోరాడవలసి వుంటుంది.
(జూన్ 17 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -