మత సామరస్యానికి ప్రతీక : సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పవిత్ర రంజాన్ మాసం నెలవంక బుధవారం కనిపించింది. గురువారం నుంచి ముస్లింలు నెలరోజుల పాటు ఉపవాసాలు చేపట్టనున్నారు. బుధవారం ప్రత్యేక ప్రార్థనలు (తరావీ నమాజ్) చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని సంతోషంగా జరుపుకుని, అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు.



