Saturday, June 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలపై ట్రోలింగ్‌, మార్ఫింగ్‌, లకారాలను నియంత్రించాలి

మహిళలపై ట్రోలింగ్‌, మార్ఫింగ్‌, లకారాలను నియంత్రించాలి

- Advertisement -

చట్టాలు మరింత కఠినంగా..
సత్వర న్యాయం జరిగేలా ఉండాలి
మహిళా జర్నలిస్టులు, మహిళలపై
ట్రోలింగ్‌‌ను ఖండించిన వక్తలు
సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో
రౌండ్‌‌టేబుల్‌ ‌సమావేశం


నవతెలంగాణ – బంజారాహిల్స్

మహిళల పట్ల ట్రోలింగ్, మార్ఫింగ్, లకారాలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో చేసే అభియోగాలను నియంత్రించాలని రౌండ్‌‌టేబుల్‌ ‌సమావేశంలో వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. మహిళల కోసం ఏర్పాటైన చట్టాలు మరింత జఠిలంగా, సత్వరం న్యాయం జరిగేలా ఉండాలని సూచించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో శుక్రవారం మహిళా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌‌టేబుల్‌ సమావేశానికి వక్తలు మల్లేపల్లి లక్ష్యయ్య, తెలంగాణ ప్రెస్ అకాడమి మాజీ చైర్మెన్ అల్లం నారాయణ, ఎడిటర్ దేవులపల్లి అమర్, మాజీ సంపాదకులు శ్రీనివాస్, ప్రొ.నాగేశ్వర్‌, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, పీవోడబ్ల్యు నాయకులు సంధ్య, జర్నలిస్టులు తొలివెలుగు రఘు, తులసి చందు, విరాహత్, రావణ్, ఆస్మా తదితరులు హాజారై మహిళల పట్ల జరిగే ట్రోలింగ్‌‌ను ఖండించారు. ట్రోలింగ్, ఫొటోల మార్ఫింగ్‌‌లు వ్యవస్థీకృతంగా జరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు మానవతావాదులు ముందుకు రావాలని కోరారు. వ్యవస్థీకృతంగా ఉండటం కారణంగా బాధితులు ఎవరిపై ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని, ఫిర్యాదులు చేసినా ఫిర్యాదుదారుకే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోలింగ్ చేసిన వారు నిక్షేపంగా ఉంటూ.. పోలీసుల నుంచి సైతం బాధితులకే ఇబ్బందులు కల్గడం దురదృష్టకరమన్నారు.

ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఏకకాలంలో లకారాలతో వందల సంఖ్యలో పోస్టింగులు రావటం సిగ్గు చేటన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు ప్రత్యేకంగా ఇటువంటి ముఠాలను ప్రోత్సహిస్తూ తమకు పడిరాని విషయాలను విపరీతంగా ట్రోలింగ్ చేస్తు రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ఆరోగ్యకర వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి భవిష్యత్ తరాలకు చెడు వ్యవసనాలను, చెడు సంప్రదాయాలను నేర్పించే ప్రమాదం పొంచి ఉందన్నారు. మహిళల కన్నీరు సమాజానికి మంచిది కాదని, ట్రోలింగ్ చేసే వారి కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారని, తాము చేసే ట్రోలింగ్ వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం మహిళల కోసం ఉన్న చట్టాలను మరింత జఠిలంగా చేసి సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -