Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాణ్యమైన భోజనం అందించాలి

నాణ్యమైన భోజనం అందించాలి

- Advertisement -

కొల్లాపూర్‌లో రోడ్డెక్కిన పీజీ విద్యార్థులు
హాస్టల్లోని సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌
నవతెలంగాణ-కొల్లాపూర్‌

కొల్లాపూర్‌ పీజీ క్యాంపస్‌లోని హాస్టల్‌ విద్యార్థులు భోజన నాణ్యతపై బుధవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ కళాశాల హాస్టల్‌లో మెనూ అమలు కాకపోవడంతో పాటు, నాణ్యతలేని భోజనాన్ని అందిస్తున్నారని మండిపడ్డారు. మెనూ అమలు చేయాలని, కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నెలరోజుల క్రితం రాతపూర్వకంగా ప్రిన్సిపల్‌కి వినతిపత్రాన్ని అందజేసినప్పటికీ మెనూలో రెండు టిఫిన్స్‌ను తొలగించారన్నారు. సరైన భోజనం అందకపోవడంతో గత నెల 26న ఇద్దరమ్మాయిలు కుప్పకూలిపోయారన్నారు.

సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి కానీ, సమస్యలు సృష్టించే విధంగా ప్రిన్సిపాల్‌ తీరు ఉందన్నారు. ఇలా అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు వాగ్వాదం జరిగింది. తక్షణమే మెనూ ఏర్పాటు చేసి, నాణ్యమైన భోజనాన్ని అందించి, హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.ఆది, పీజీ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు విలాస్‌, శివ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -