Thursday, February 19, 2026
E-PAPER
Homeజాతీయంకర్రెగుట్టలు ఆపరేషన్‌-2 ప్రారంభం

కర్రెగుట్టలు ఆపరేషన్‌-2 ప్రారంభం

- Advertisement -

గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే!
పక్క సమాచారంతో ఆపరేషన్‌-2 స్టార్ట్‌

నవతెలంగాణ-చర్ల
కర్రెగుట్టల అటవి ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాల కదలికలు వేగం పుంజుకున్నాయి. ”ఆపరేషన్‌-2” పేరుతో ప్రత్యేకదళాలు దాడులు, కూంబింగ్‌ చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి లక్ష్యం దేవ్‌జీ అని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, గడువు ముగియడానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలుండగా, పక్కా ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఆపరేషన్‌ 2 ప్రారంభించినట్టు తెలుస్తోంది. అడవి మార్గాలు, కొండ చరియలు, గుట్టల పరిసర ప్రాంతాల్లో కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయి. స్థానిక గ్రామాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసినట్లు సమాచారం. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని. భద్రతా వర్గాలు అధికారికంగా ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -