Saturday, June 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి: సర్పంచ్

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని సర్పంచ్ మడి ప్రవీణ్ అన్నారు. శనివారం కుభీర్ మండలంలోని ఫార్డి (బి )ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ప్రి ప్రైమరి పాఠశాలను మండల విద్యాధికారి విజయ్ కుమార్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పిల్లలకు ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృంద భోధనతెతో వారి భవిష్యత్ కు బంగారు బాటలు పడతాయని చెప్పారు. సర్కార్ బడుల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తో పాటు, త్వరలో బ్రేక్ ఫాస్ట్, అందించడం జరుగుతుందన్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ లను ఉచితంగానే అందిస్తున్నారని, వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మడి ప్రవీణ్, ఉప సర్పంచ్ పోసాని మండల విద్యాధికారి విజయ్ కుమార్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మోసిన్, గ్రామస్తులు నరేందర్ సురేష్, వార్డ్ సభ్యులు శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -