- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పల్లెల్లో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని భూపాలపల్లి పంచాయితీ అధికారి శ్రీలత మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయతీలోని జీపీ రికార్డులను తనిఖీ చేశారు. డిమాండ్ రిజిస్టర్, సిబ్బంది రోజువారీ రిజిస్టర్, పన్ను వసూల్ తదితర రికార్డులు తనిఖీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీపీ అభివృద్ధికి విడుదల చేస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా గ్రామ అభివృద్ధి వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



