Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువు పట్ల ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగి ఉండాలి: ఎంఈఓ

చదువు పట్ల ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగి ఉండాలి: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ –  మిరుదొడ్డి 
ప్రాథమిక పాఠశాల మోతే గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం  నిర్వహిచారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ విశిష్ట అతిథులుగా మండల విద్యాధికారి దోమకొండ అంజయ్య  సమక్షంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ  చేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల గురించి తల్లిదండ్రులు లేవనెత్తిన విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తూ విద్యార్థుల చదువుపట్ల క్రమశిక్షణ పట్ల శ్రద్ధ చూపాలని వారు సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో పిల్లల సంఖ్యను పెంచాలని ఎంఈఓ అంజయ్య  సూచించారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి దిగ్విజయం చేసినందుకు పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -