Saturday, June 20, 2026
E-PAPER
Homeజిల్లాలుసింగిల్ విండో డైరెక్టర్ల మూకుమ్మడి రాజీనామా

సింగిల్ విండో డైరెక్టర్ల మూకుమ్మడి రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని సింగిల్ విండో డైరెక్టర్లు పలువురు ముకుమ్మడిగా రాజీనామా చేశారు. శనివారం సింగిల్ విండో కార్యాలయంలో డైరెక్టర్లకు తెలియకుండా విండో చైర్మన్, కార్యదర్శి ఉప్లూర్ రైతులకు రెండు లారీల యూరియాను తరలించారు. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో ఉప్లూర్ రైతులకు పంపించడంతో కమ్మర్ పల్లి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ డైరెక్టర్లకు తెలియకుండా రెండు లారీల యూరియాను ఉప్లూర్ కు తరలించడానికి నిరసిస్తూ పలువురు డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను విండే కార్యదర్శి శంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన డైరెక్టర్లు మాట్లాడుతూ.. గ్రామ రైతులు యూరియా కోసం అల్లాడుతున్న సమయంలో విండో చైర్మన్, కార్యదర్శి రెండు లారీల యూరియాను ఉప్లూర్ తరలించడం సరైంది కాదన్నారు. వారి వైఖరిని, యూరియ యాప్ తొలగించాలని నిరసన వ్యక్తం చేస్తూ సొసైటీ డైరెక్టర్ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేసినట్లు తెలిపారు. దీనిపైన ఉన్నత అధికారులు స్పందించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -