Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొంపల్లిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం..

కొంపల్లిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం..

- Advertisement -

గుర్రం బండి మీద పట్టు వస్త్రాలను తెచ్చిన బూరుగువారు
కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. 
భక్తులకు అన్నదానం చేసిన చెరుకూరి ప్రభాకర్..
నవతెలంగాణ – మునుగోడు

మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను బూరుగు శ్రీను , జనార్ధన్ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన విద్యుత్ దీపాలతో అమర్చబడిన గుర్రం బండి పై పట్టు వస్త్రాలను , తలంబ్రాలను డప్పు చెప్పులతో , కోలాట బృంద సభ్యులతో దేవాలయలయానికి తీసుకువచ్చి శివపార్వతులను ముస్తాబు చేసి కళ్యాణ మండపంలో కళ్యాణమును ఘనంగా నిర్వహించారు.

అనంతరం హైదరాబాద్ కు చెందిన చెరుకూరి  ప్రభాకర్ జ్యోతి దంపతులు భక్తులకు అన్న దాన కార్యక్రమం చేపట్టారు. ఈనెల 15,16 తేదీలో క్రితిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మొగుదాల నరసింహ గౌడ్ సహకారంతో ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి 30వేలు రెండవ బహుమతి 15 వేలు , మూడో బహుమతి 7 వేలు తోపాటు షీల్డ్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి మాట్లాడుతూ శివ పర్వతల కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ , గ్రామ ప్రజలు మక్కెన అప్పారావు , వడ్లమూడి హనుమయ్య , నామోజు రత్నాచారి , మోగుదాల శంభు, బోయపర్తి సురేందర్ , జాల నాగరాజ్ , వార్డు సభ్యులు , గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -