Saturday, June 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కట్టమైసమ్మ దేవాలయ హుండీ లెక్కింపు

కట్టమైసమ్మ దేవాలయ హుండీ లెక్కింపు

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామంలోని శ్రీ కట్ట మైసమ్మ దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నాగర్‌కర్నూల్ పరిశీలకులు టి. మదన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో జరిగింది.

కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఆర్. శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ ఎడ్ల నరేష్, ధర్మకర్తల సభ్యులు వెంకటేష్, నిరంజన్, రవి, లక్ష్మీ, ఆలయ పూజారులు దేవర్ల సాయిల్, దేవర్ల వెంకటేష్, మల్లయ్య, ఉప్పునుంతల తహసీల్దార్ సునీత, ఎస్సై మహేష్ గౌడ్, పోలీసు సిబ్బంది, అచ్చంపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది రేణయ్య, భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.

హుండీ లెక్కింపులో నోట్ల రూపంలో రూ.51,930, చిల్లర రూపంలో రూ.16,466 లభించగా, మొత్తం ఆదాయం రూ.68,396 వచ్చినట్లు అధికారులు తెలిపారు. హుండీ ఆదాయాన్ని అచ్చంపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఆలయ ఎస్‌బీఐ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -