Saturday, June 20, 2026
E-PAPER
Homeజిల్లాలుఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని మంత్రి సీతక్కకు వినతి

ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని మంత్రి సీతక్కకు వినతి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరులో శనివారం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఈ క్రమంలో పట్టణంలో దుర్గాబాయి మహిళా శిశు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ పోరాట కమిటీ నాయకులు మంత్రి సీతక్కను కలిశారు. గత పదేండ్లుగా ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పోరాడుతున్నా.. ఎలాంటి ఫలితం లేదని వారు మంత్రి ఎదుట వాపోయారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి, ఆలేరు ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని వినతిప్రత్నాన్ని మంత్రి సీతక్కకు సమర్పించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కో కన్వీనర్ కళ్లెపు అడివయ్య, చెక్క వెంకటేష్, బేజాడి కుమార్, కేమిడీ ఉప్పలయ్య, సలీం, పద్మ సుదర్శన్, యేలుగల కుమారస్వామి , రాచకొండ ఉదయ్,  సముద్రాల సత్యం,  సిహెచ్ కనకయ్య, వడ్డమాని బాలరాజు, సుంచు రాములు, తమ్మడి రమేష్, అంజి బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -